రివాల్వర్‌తో సీఐ హల్‌చల్.. ఉద్యోగులపై దాడి | CI hulchul with rivalvor in ghmc elections | Sakshi
Sakshi News home page

రివాల్వర్‌తో సీఐ హల్‌చల్.. ఉద్యోగులపై దాడి

Feb 1 2016 5:35 PM | Updated on Aug 14 2018 4:46 PM

రివాల్వర్‌తో సీఐ హల్‌చల్.. ఉద్యోగులపై దాడి - Sakshi

రివాల్వర్‌తో సీఐ హల్‌చల్.. ఉద్యోగులపై దాడి

జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బందిపై ఓ సీఐ రివాల్వర్తో హల్చల్ సృష్టించాడు.

కుత్బుల్లాపూర్: జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బందిపై ఓ సీఐ రివాల్వర్తో హల్చల్ సృష్టించాడు. ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు చేయి చేసుకున్న ఘటన కుత్బుల్లాపూర్లో చోటుచేసుకుంది.

కుత్బుల్లాపూర్ చింతల్ ఇక్ఫాయ్ స్కూల్కు ఎన్నికల విధుల కోసం ఉన్నతాధికారులు కొంతమంది ఉద్యోగులను నియమించుకున్నారు. వారిలో కొంత మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సోమవారం సాయంత్రం అధికారులు ఆదేశించారు. దీంతో వేతనాల విషయంలో అధికారులకు, ఉద్యోగులకు వివాదం రావడంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

దీంతో బాలానగర్ సీఐ భిక్షపతిరావు రంగప్రవేశం చేశాడు. ఆందోళనకు దిగిన వారిలో ఓ ముగ్గురిని కొట్టాడు. రివాల్వర్ చేత్తో పట్టుకుని అక్కడున్న వారిని భయాందోళనకు గురి చేశాడు. తాము ఆహారం లేకుండా ఉదయం నుంచి పనిచేసి భత్యం కోసం డిమాండ్ చేస్తుంటే పోలీసులు వ్యవహరించిన దురుసు తీరు పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement