'సీనియర్లను డమ్మీలుగా మారుస్తున్న కేసీఆర్' | Cheruku Sudhakar takes on TRS president K.Chandrasekhar rao | Sakshi
Sakshi News home page

'సీనియర్లను డమ్మీలుగా మారుస్తున్న కేసీఆర్'

Mar 25 2014 12:56 PM | Updated on Aug 15 2018 7:50 PM

'సీనియర్లను డమ్మీలుగా మారుస్తున్న కేసీఆర్' - Sakshi

'సీనియర్లను డమ్మీలుగా మారుస్తున్న కేసీఆర్'

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్ ప్రకటించారు.

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లో చెరుకు సుధాకర్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై సుధాకర్ నిప్పులు చెరిగారు.ఆయన వైఖరిని సవాల్గా తీసుకుని పార్టీని వీడితున్నట్లు తెలిపారు.తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు కాకుండా కార్పొరేట్ స్థాయివాళ్లకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

పార్టీలోని సీనియర్లను కేసీఆర్ డమ్మీలుగా మారుస్తున్నారని విమర్శించారు.రానున్న ఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.అయితే రానున్న ఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్థిగానైనా పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement