పేట్‌ బషీరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌ | ‍chain snatching in basheerabad | Sakshi
Sakshi News home page

పేట్‌ బషీరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌

Jul 25 2017 4:26 PM | Updated on Sep 5 2017 4:51 PM

నగరంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది.

హైదరాబాద్‌: నగరంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. బ్యాంకు కాలనీలో మంగళవారం నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మీ బాయి అనే మహిళ మెడలోని 5 తులాల పుస్తెల తాడును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement