'కేసీఆర్.. ఓయూని మరిస్తే తల్లిని మరిచినట్లే'
పెద్ద నోట్ల రద్దు విషయం బీజేపీ, టీడీపీ నేతలకు ముందే తెలుసని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు విషయం బీజేపీ, టీడీపీ నేతలకు ముందే తెలుసని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. అందుకే వారు ఎలాంటి టెన్షన్ పడటం లేదని చెప్పారు. పాత నోట్ల రద్దు విషయంలో భయపడుతోంది టీఆర్ఎస్ నేతలే అని ఆరోపించారు.
అందుకే డిసెంబర్ 31న తలపెట్టిన బహిరంగ సభను వాయిదావేశారని చెప్పారు. సచివాలయం వాస్తు దోషం అంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాడ మండిపడ్డారు. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీని మర్చిపోతే కన్నతల్లిని మర్చిపోయినట్లేనని చాడ హితవు పలికారు.


