డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవర్నెస్ నిర్వహిస్తూ వరంగల్‌కు చెందిన నాగరాజు నాన్‌స్టాఫ్ 50 గంటల సైకిల్ యాత్ర నిర్వహించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవర్నెస్ నిర్వహిస్తూ వరంగల్ జిల్లా కొత్తపల్లికి చెందిన నాగరాజు నాన్‌స్టాఫ్ 50 గంటల సైకిల్ యాత్ర చందానగర్ డివిజన్‌లో ఆదివారం నిర్వహించారు. 26 ఆగస్టు నుండి ప్రారంభమైన సైకిల్ యాత్ర జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్‌లలో కొనసాగించనున్నాడు. ఈ నేపథ్యంలో చందానగర్ డివిజన్‌కు వచ్చిన నాగరాజుకు స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. ఉదయం 7.30 గంటలకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నాగరాజుకు స్వాగతం పలికారు. కాఫ్రా మొదటి డివిజన్ నుంచి ప్రారంభమైన నాన్‌స్టాఫ్ సైకిల్ యాత్ర నిద్ర, విశ్రాంతి లేకుండా 29 ఆగస్టు రాత్రి 12 గంటల వరకు కొనసాగుతోందని నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల అవర్నెస్ పోగ్రాం సైకిల్ యాత్ర ద్వారా తీసుకురావడం అభినందనీయమన్నారు.