చంద్రబాబుపై దండయాత్ర చేయండి: భూమన | Bhumana karunakar reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై దండయాత్ర చేయండి: భూమన

Sep 23 2016 3:03 AM | Updated on May 29 2018 4:26 PM

ఎన్నిలక వాగ్దానాలను తుంగలోకి తొక్కిన చంద్రబాబుపై ప్రజలంతా ఉద్యమించాలని భూమన పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : ఎన్నిలక వాగ్దానాలను తుంగలోకి తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజలంతా ఉద్యమించాలని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుపై ప్రజలంతా ఉద్యమించాలన్నారు. తెలుగుజాతి ప్రజలంతా చంద్రబాబుపై దండయాత్ర చేయాలని భూమన అన్నారు. 

ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబుపై తిరగబడాలని భూమన సూచించారు. అన్నివర్గాల ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, కాపుజాతి ఉ‍ద్యమించిన తరహాలో మిగిలిన అన్నివర్గాలు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వరదలతో జన జీవనం అతలాకుతలం అయిందని, వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని భూమన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement