కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ధర్నా | bank employees protest infront of kavuri samba shiva rao house | Sakshi
Sakshi News home page

కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ధర్నా

Mar 20 2016 11:57 AM | Updated on Aug 15 2018 7:45 PM

కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ధర్నా - Sakshi

కావూరి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది ధర్నా

రుణాలు తిరిగి చెల్లించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు.

 శ్రీనగర్‌కాలనీ: రుణాలు తిరిగి చెల్లించాలని కోరుతూ పంజాబ్ నేషనల్  బ్యాంకు ఉద్యోగులు మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బాలాపురి బస్తీలోని ఆయన ఇంటి ముందు  ధర్నాకు దిగారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పేరిట రూ.160 కోట్ల రుణాలు తీసుకున్నారని తెలిపారు. సక్రమంగా తిరిగి చెల్లించడం లేదన్నారు. దీంతో నిరసనకు దిగినట్టు ని డీజీఎం రాజీవ్‌పురి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బీఎస్ శర్మ, వెంకటేశ్వర్లు, అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement