మంత్రి రావెల కుమారుడికి బెయిల్ మంజూరు | AP Minister ravela kishorebabu son susheel released on bail | Sakshi
Sakshi News home page

మంత్రి రావెల కుమారుడికి బెయిల్ మంజూరు

Mar 14 2016 4:30 PM | Updated on Mar 23 2019 8:59 PM

మంత్రి రావెల కుమారుడికి బెయిల్ మంజూరు - Sakshi

మంత్రి రావెల కుమారుడికి బెయిల్ మంజూరు

మహిళా టీచర్ను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌, అతని డ్రైవర్ రమేష్కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

హైదరాబాద్: మహిళా టీచర్ను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌, అతని డ్రైవర్ రమేష్కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా మహిళను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. సోమవారం సాయంత్రం నిందితులు విడుదలకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement