మరికొద్ది గంటల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులు, గురువారం సెకండియర్ విద్యార్థులు ద్వితీయభాష పరీక్షలను రాయనున్నారు.
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
జంట జిల్లాల నుంచి 3.5 లక్షల మంది అభ్యర్థులు
8.45 దాటితే పరీక్షాకేంద్రంలోకి అనుమతి నిల్
సాక్షి, సిటీబ్యూరో: మరికొద్ది గంటల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులు, గురువారం సెకండియర్ విద్యార్థులు ద్వితీయభాష పరీక్షలను రాయనున్నారు. పరీక్షలు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులను అరగంట ముందు నుంచే పరీక్ష జరిగే హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45 తర్వాత పరీక్షాకేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు.
ఆలస్యంగా వచ్చినట్లైతే అధికారులు ఇచ్చిన ప్రొఫార్మాలో అభ్యర్థులు ఆలస్యానికి కారణాలను వివరించాలి. సీఎస్, డీ వోలు మినహా పరీక్షాకేంద్రంలో ఎవ్వరూ (ఇన్విజిలేటర్లతో సహా) సెల్‌ఫోన్లు వినియోగించకూడదు. ఆకస్మిక తనిఖీల నిమిత్తం రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు.