‘ఉగ్ర’ అనుమానితుల్లో ఆరుగురి విడుదల | After Investigation NIA Releases 6 out of 11 persons | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ అనుమానితుల్లో ఆరుగురి విడుదల

Jun 30 2016 9:02 AM | Updated on Oct 17 2018 5:14 PM

హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నారన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని విచారణ అనంతరం ఎన్ఐఏ అధికారులు విడిచిపెట్టారు.

హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నారన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని విచారణ అనంతరం ఎన్ఐఏ అధికారులు విడిచిపెట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, ఉగ్రవాద దాడులకు కుట్రపన్నుతున్నారన్న అనుమానంతో 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని ఎన్ఐఏ కార్యాలయంలోనే విచారించారు. అనంతరం ఆరుగురిని విడిచిపెట్టారు.

సయ్యద్ నైమతుల్లా హుస్సేని అలియాస్ యాసిర్‌ నైమతుల్లా (42), ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ అలియాస్ రిజ్వాన్ (29), మహ్మద్ అతుల్లా రహమాన్ (30), అబ్దుల్ అలియాస్ అల్ జిలానీ అబ్దుర్ ఖాదర్ మొహిసిన్ మహమూద్ (32), ఏఎం అజహర్ (20), మహ్మద్ అర్బాజ్ అహ్మద్ (21) లను విడుదల చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement