'ఓటుకు కోట్లు'లో ఈసీ పిటిషన్ తిరస్కరణ | acb court refuses ECs petetion | Sakshi
Sakshi News home page

'ఓటుకు కోట్లు'లో ఈసీ పిటిషన్ తిరస్కరణ

Jun 27 2015 9:40 PM | Updated on Aug 17 2018 12:56 PM

'ఓటుకు కోట్లు'లో ఈసీ పిటిషన్ తిరస్కరణ - Sakshi

'ఓటుకు కోట్లు'లో ఈసీ పిటిషన్ తిరస్కరణ

ఓటుకు కోట్లు కేసులో అనూహ్య పరిణామం సంభవిచింది.

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అనూహ్య పరిణామం సంభవిచింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత సహా ఇతర నేతలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో ఏసీబీ రికార్డు చేసిన ఆడియో, వీడియో రికార్డులను ఎన్నికల సంఘానికి ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి లక్ష్మీపతి శనివారం తిరస్కరించారు.

ఈ పిటిషన్ విచారణార్హం కాదని స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినవ్యవహారానికి సంబంధించి ఏసీబీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు, ఇతర ఆడియో, వీడియో రికార్డులు ఇప్పించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, డిప్యూటీ సెక్రటరీ శ్రీదేవసేన అల్లంరాజు గత మూడు రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement