హెచ్సీయూలో ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్ | ABVP activists are arrested at Hcu | Sakshi
Sakshi News home page

హెచ్సీయూలో ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్

Jan 30 2016 1:15 AM | Updated on Oct 2 2018 8:08 PM

హెచ్సీయూ గేట్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: హెచ్సీయూ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్సిటీ గేట్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాహుల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేపట్టి రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ హైదరాబాద్ రాక నేపథ్యంలో శనివారం తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

నేడు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా వర్సిటీ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీకి వచ్చి విద్యార్థులు చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులకు సంఘీభావంగా ఆయన దీక్ష చేపట్టారు. నేటి సాయంత్రం ఆరు గంటల వరకు రాహుల్ దీక్ష కొనసాగించనున్నట్లు సమాచారం. రోహిత్ తల్లి రాధిక కూడా రాహుల్ చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement