6న పింక్ రిబ్బన్ వాక్ | 6th on the Pink Ribbon Walk | Sakshi
Sakshi News home page

6న పింక్ రిబ్బన్ వాక్

Sep 26 2013 2:32 AM | Updated on Sep 1 2017 11:02 PM

మహిళల మృతికి కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్‌ది రెండో స్థానమని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్‌లెనర్ పేర్కొన్నారు.

బంజారాహిల్స్, న్యూస్‌లైన్: మహిళల మృతికి కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్‌ది రెండో స్థానమని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్‌లెనర్ పేర్కొన్నారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం తాజ్‌కృష్ణా హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మెక్‌లెనర్ ప్రసంగించారు. సినీ నటి అక్కినేని అమల మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే వ్యాధిని అరికట్టడం సులువవుతుందన్నారు.

ప్రతి మహిళ ఏడాదికోసారి తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించుకోవాలన్నారు. వ్యాధిని తొలి దశలోనే అరికడితే రొమ్మును తొల గించాల్సిన అవసరం ఉండదని, కీమోథెరపీ అవసరమూ  రాదని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డెరైక్టర్ డాక్టర్ పి.రఘురామ్ వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే అక్టోబర్ 6న కేబీఆర్ పార్కు వద్ద పింక్ రిబ్బన్ వాక్-2013 నిర్వహించనున్నట్లు తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ కింగ్‌షుక్‌నాగ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement