'చంచల్గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి' | 60 Residential schools in telangana, says KCR | Sakshi
Sakshi News home page

'చంచల్గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'

Dec 29 2015 7:08 PM | Updated on Aug 15 2018 9:30 PM

'చంచల్గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి' - Sakshi

'చంచల్గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'

రాష్ట్రానికి కరువు సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రానికి కరువు సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపామని ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని పరిస్థితులను వెంటనే న్యూఢిల్లీ వెళ్లి  కేంద్రానికి వివరించాలని కేసీఆర్ ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు.

వచ్చే ఏడాది 60 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సదరు రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగాలని ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొదటి ఏడాది 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. ఆ తర్వాత ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.

చంచల్గూడ జైలును చర్లపల్లికి తరలించాలని... అలాగే మలక్పేటలోని రేస్కోర్స్ను నగర శివారుకు తరలించాలని ఉన్నతాధికారులకు కేసీఆర్ ఆదేశించారు. సదరు రెండు స్థలాలు రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉపయోగించాలని ఉన్నతాధికారులను కేసీఆర్ కోరారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement