రంగారెడ్డి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువజామున ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఫామ్ హౌస్ పార్టీలో విషాదం
Jan 19 2016 10:55 AM | Updated on Mar 28 2018 11:26 AM
మేడిపల్లి: రంగారెడ్డి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువజామున ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మేడిపల్లి శివారులోని చెంగిచెర్ల మ్యారీగోల్డ్ ఫామ్‌హౌస్‌లో సోమవారం రాత్రి జరిగిన ఓ బర్త్ డే పార్టీలో పాల్గొన్న వంశీకృష్ణ అనే యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో శవమై తేలాడు.
వంశీకృష్ణ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు మంగళవారం ఉదయం పామ్‌హౌస్‌ను పరిశీలించి 17 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement


