నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది.
మరో ఇద్దరు అధికారులు సస్పెండ్
Dec 10 2016 7:51 PM | Updated on Sep 4 2017 10:23 PM
హైదరాబాద్: నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ఇద్దరు సెక్షన్ ఆఫిసర్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అక్రమ కట్టడాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను వేటు వేసినట్లు తెలిపారు. ఇప్పటికే స్థానిక డిప్యూటీ కమిషనర్ మనోహర్, సహాయ సిటీ ప్లానర్ కృష్ణమోహన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనలో మొత్తం నలుగురు అధికారులపై వేటు పడింది.
Advertisement
Advertisement