బంగారం వర్షం కురిపిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న దొంగబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: బంగారం వర్షం కురిపిస్తా నంటూ మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబాను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగబాబా మాటలకు మోస పోయిన పలువురు ముందుగానే డబ్బులు చెల్లించుకున్నారు. అయితే, బంగారం ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో మోసం చేసినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.