కాశీబుగ్గ ఆలయంలో అపశ్రుతి | constable dies due to current shock | Sakshi
Sakshi News home page

కాశీబుగ్గ ఆలయంలో అపశ్రుతి

Mar 7 2016 4:20 PM | Updated on Mar 19 2019 5:52 PM

నగరంలోని కిషన్ బాగ్ లో ఉన్న కాశీబుగ్గ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం అపశృతి చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని కిషన్ బాగ్ లో ఉన్న కాశీబుగ్గ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం అపశృతి చోటు చేసుకుంది.  భక్తులపై పడిన కరెంటు తీగలను తప్పించబోయి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.  ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలుచున్న భక్తులపైకి అకస్మాత్తుగా కరెంటు తీగ తెగిపడింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అప్రమత్తమై తీగను తొలగించబోయారు. ఈ క్రమంలోనే ఆయన షాక్‌కు గురై మృతిచెందాడు.  మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ బహదూర్‌పురా స్టేషన్‌లో పని చేస్తున్నారని సమాచారం.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement