ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.
కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. అయితే సీఎం పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారంటూ సీపీఐ, సీపీఎం నేతలను ముందుగా అరెస్టు చేశారు. అదే విధంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబును హౌజ్ అరెస్టు చేశారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
అదుపులో 26 మంది
వైఎస్సార్ జిల్లాలోని అలంఖాన్‌పల్లి గ్రామంలో జరగనున్న జన్మభూమి బహిరంగ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో ఐదు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన 26 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.