రజకుల్ని బాదిపడేస్తున్న బాబు

Article On Chandrababu Showing Discrimination On Rajakulu - Sakshi

తెలుగుదేశం పార్టీకి 35 ఏళ్ళుగా ఓట్లేస్తున్న రజకుల్ని ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి కనీస ప్రయత్నం చేయని చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి రజకులు వందేళ్ళు వెనక్కిపోయారు. బాబు పాలనలో రజకుల స్థితి కార్పొరేట్‌ సంస్థల దగ్గర బట్టలుతికే కూలీల స్థాయికి పడిపోయింది. ఎన్టీఆర్‌ ప్రభుత్వం 1985లో రజకుల్ని ఎస్సీ జాబి తాలో చేర్చాలని కేంద్రానికి ఇచ్చిన సిఫారసుకు కృతజ్ఞతగా రజకులు టీడీపీకి ఓటు బ్యాంకయ్యారు. 1995లో జరిగిన వెన్నుపోటు కుట్ర ద్వారా బాబు సీఎం అయ్యాక రజకులు అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యారు. దేశమంతా బట్టలుతికేది రజకులైతే, తిరుమల తిరుపతి దేవస్థానంలో బట్టలు ఉతికేది బాబు బంధువులు. టీటీడీలో బట్టలుతికే కాంట్రాక్టును తన బంధువుల ఏజెన్సీకి కట్టబెట్టి, బాబు రజకుల నోట్లో మట్టి కొట్టారు. 35 ఏళ్ళుగా ఓట్లేస్తున్న రజకులపట్ల అభిమానం గానీ, కృతజ్ఞతగానీ, ఎస్సీ ఇన్‌క్లూజన్‌ హామీ అమలు చెయ్యాలన్న సంకల్పం గానీ బాబుకు లేదు. 

మెజారిటీ రజకులు తన ప్రత్యర్థి పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నా వైఎస్సార్‌ ఏనాడూ రజకుల పట్ల వివక్ష చూపలేదు. వైఎస్సార్‌ రజక సామాజిక వర్గానికి చెందిన బసవరాజు సారయ్య, పాండు, రాజారత్నంలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. 2004 ఎన్నికల్లో  వైఎస్సార్‌ రజకులకు ఎస్టీ ఇన్‌క్లూజన్‌ హామీ ఇచ్చి, సీఎం అయ్యాక కేంద్రానికి సిఫారసు కూడా చేశారు. వైఎస్‌ మరణం  రజకుల ఎస్టీ రిజర్వేషన్‌ మీద తీవ్ర ప్రభావం చూపింది. వైఎస్సార్‌లానే వైఎస్‌ జగన్‌ కూడా రజకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో అధికారంలోకి వస్తే రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఎస్సీ జాబితాలో చేరుస్తామని, ఇనాం/ మాన్యం భూముల్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని వైఎస్‌ జగన్‌ పక్షాన ఉండాల్నో, రజకుల్ని నమ్మించి మోసం చేసిన బాబు పక్షాన నిలవాల్నో.. తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. దేశం శాస్త్ర, సాంకేతిక పరంగా పరుగెడుతుంటే, చాకలోళ్ళు కాబట్టి చాకిరేవులోనే ఉండాలన్న ఫ్యూడల్‌ తత్వంతో రజక బిడ్డలకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిన బాబు పాలన కావాల్నో, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తెచ్చి రజక బిడ్డల్ని ఇంజనీర్లని, ఉన్నత విద్యావంతుల్ని చేసిన రాజన్న రాజ్యం రావాల్నో తేల్చుకోవాల్సిందీ, తమ బిడ్డల తలరాతలు రాసుకోవాల్సిందీ రజకులే.

-పొటికలపూడి జయరాం, రాష్ట్ర అధ్యక్షులు, రజక రిజర్వేషన్‌ పోరాట సమితి 
మొబైల్‌ : 85000 16809 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top