కరోనా కుట్రలో కనపడని కోణం

Another Angle on coronavirus conspiracy theory! - Sakshi

విశ్లేషణ

కరోనా వైరస్‌ ఎలా పుట్టుకొచ్చింది, ఎలా విస్తరించింది, దానిపట్ల పలు దేశాలు చేసిన, చేస్తున్న తప్పులేమిటి అనే అంశాలను ప్రపంచం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏమీ తేలకుండానే ముందస్తుగా చైనాను నేరస్తురాలిగా ప్రకటించడం ద్వారా ట్రంప్, అమెరికాలోని ఇతర నేతలు దీనిపై ప్రపంచ స్థాయి విచారణ అవసరమే లేదని తేల్చేస్తున్నారు. అంతకుమించి చైనాను బోనులో నిలబెట్టడానికి ప్రయత్నించడం అనేది స్వీయ సమర్ధన తప్ప మరేమీ కాదు. ప్రపంచ మానవాళి ముందడుగు వేయాలంటే వైరస్‌లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం అత్యవసరం. అంతే తప్ప చైనాపై ఆరోపించి స్వీయ పరాజయం కోసం ప్రయత్నించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రత్యేకించి చైనా సహకారం లేనిదే ఈ వైరస్‌ నిరోధం అసాధ్యమవుతున్న పరిస్థితుల్లో రాజకీయ ఎత్తులు అసలు పనికిరావు. (కరోనా వైరస్: మరో నమ్మలేని నిజంj)

ఏప్రిల్‌ 30న,  అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ కార్యాలయం వూహాన్‌లో చెలరేగిన వైరస్‌ పూర్వాపరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకడం ద్వారా వ్యాప్తి చెందిందా లేక వూహాన్‌ లేబొరేటరీలో ప్రమాదవశాత్తూ లీక్‌ కావడం ద్వారా విస్తరించిందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే శాస్త్రజ్ఞుల విస్తృత ఆమోదం ప్రకారం చూస్తే కోవిడ్‌–19 వైరస్‌ మానవ నిర్మితమైంది కాదని లేక జన్యుపరంగా మెరుగుపర్చింది కాదని భావిస్తున్నట్లు ఆ అమెరికా నిఘా సంస్థ పేర్కొంది. (ట్రంప్కి రోజూ కోవిడ్ పరీక్షలు)

ఒక్కమాటలో చెప్పాలంటే, వైరస్‌ చైనాలోనే పుట్టినా, అది వూహాన్‌ పరిశోధనా సంస్థ నుంచే లీక్‌ అయిందనడానికి ప్రత్యక్ష ప్రమాణం లేదని ఆ సంస్థే చెబుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వారం, అమెరికా ప్రభుత్వ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫాసీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచి పుట్టిందని చెప్పలేమని మరోసారి వక్కాణించారు. ఈ వైరస్‌ ప్రకృతిలోనే పుట్టుకొచ్చిందని, తర్వాతే అది ప్రాణుల్లోకి వ్యాపించిందని శాస్త్రీయ ఆధారాలు బలంగా నొక్కి చెబుతున్నాయని ఫాసీ చెప్పారు. అయితే కరోనా వైరస్‌ ఉనికిని ఎవరైనా జంతువుల్లో గుర్తించి దాన్ని వూహాన్‌ ల్యాబ్‌కు తీసుకువచ్చి ఉండవచ్చని, అక్కడ అది ప్రమాదవశాత్తూ లీక్‌ అయి బయటకు వచ్చిందన్న అభిప్రాయంతో ఫాసీ ఏకీభవించారు. (గుడ్‌న్యూస్‌ : వ్యాక్సిన్‌ దిశగా కీలక ముందడుగు)

మంగళవారం వెలువడిన ఒక నివేదిక ప్రకారం, పంచ నేత్రాల కూటమి–ఫైవ్‌ ఐస్‌ అలయెన్స్‌–అనే 5 దేశాల కూటమి (బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా)కి అందిన నిఘా సమాచారం.. కరోనా వైరస్‌ లేబొరేటరీలో ప్రమాదవశాత్తూ లీక్‌ అయి విస్తరించినది కాదని, బహుశా అది వూహాన్‌ మార్కెట్‌లో పుట్టి ఉంటుందని సూచించింది. అంటే ఈ వైరస్‌ ల్యాబ్‌లో ప్రమాదవశాత్తూ లీక్‌ అయి విస్తరించిందే అంటూ పదేపదే ఆరోపిస్తూన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ విషయాన్ని తన సన్నిహిత మిత్రదేశాలచేత కూడా ఒప్పించలేకపోతున్నారన్నది స్పష్టం. (వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చింది: పాంపియో)

ట్రంప్‌ వాషింగ్టన్‌ డీసీ టౌన్‌హాల్‌లోని లింకన్‌ స్మారక భవనంలో సమావేశం నిర్వహించిన 24 గంటల తర్వాతే ఈ పంచనేత్రాల కూటమి నివేదిక, ఫాసీ ప్రకటన వెలువడ్డాయి. కరోనా వైరస్‌ చైనా కుట్రలో భాగమే అంటూ ఆ భేటీలో కూడా ట్రంప్‌ అదే పాట వినిపించారు. పైగా వూహాన్‌లో ఏం జరిగింది అనే విషయంపై త్వరలోనే కీలకమైన సమాచారం అందుతుందని భావిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. వైరస్‌కు సంబంధించి చైనా ప్రవర్తనలో నేరపూరితమైన అంశం ఏదైనా ఉందా అనే దానిపై ట్రంప్‌ మాట్లాడుతూ, ‘వారు ఘోరతప్పిదం చేశారనుకుంటున్నాను. కానీ వారు దాన్ని అంగీకరించేందుకు సిద్ధపడటం లేదు. పైగా తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ముగించారు. (కరోనాపై నిర్లక్ష్యం తగదు: జిన్‌పింగ్‌)

పైగా కరోనా వైరస్‌ దేశంపై దాడి చేస్తోందని తెలిశాక చైనా అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా వ్యవహరించిందని ఆరోపించడానికి కూడా ట్రంప్‌ తెగబడ్డారు. ఇక ఓడీఎన్‌ఐ తన నివేదికతో ముందుకొచ్చాక, దాంట్లోని విషయాలు తనకే బాగా తెలుసునని ట్రంప్‌ పేర్కొన్నాడు. కోవిడ్‌–19 సాంక్రమిక వ్యాధి వూహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టుకొచ్చిందనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా అని ఒక మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నించినప్పుడు అవును, నా వద్ద ఆధారాలు ఉన్నాయని ట్రంప్‌ నొక్కి చెప్పారు. కానీ ఆ ఆధారాల గురించి మీకు చెప్పబోనని, ఆ విషయం వెల్లడించడానికి నాకు అనుమతి లేదని చెప్పి ట్రంప్‌ తప్పించుకున్నారు. 

ఓడీఎన్‌ఐకి, దాని బాస్‌ అయిన అమెరికన్‌ అధ్యక్షుడికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ప్రొఫెషనల్‌ నైపుణ్యమే. అమెరికాలోని 17 వివిధ నిఘాసంస్థల కృషిని సమన్వయించే సంస్థ ఓడీఎన్‌ఐ కాగా ఈ సంవత్సరం నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో గెలుపు లక్ష్యం పెట్టుకుని ‘ల్యాబ్‌ నుంచి బయటపడిన వైరస్‌’ గురించి మాట్లాడుతున్న రాజకీయ నాయకుడు ట్రంప్‌. ఈ అంశంపై ప్రామాణిక సమాచారం ప్రకారం వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి 30 కిలోమీటర్ల దూరంలోని జంతుమాంస, సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో ఈ వైరస్‌ మొదట పుట్టిందని తెలుస్తోంది. 

ట్రంప్, అతడి రాజకీయ సహచరుల ఆరోపణలకు తగినట్లుగానే అమెరికన్‌ రైట్‌ వింగ్‌ ప్రచురణ సంస్థలు, టాబ్లాయిడ్లు కూడా కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టుకొచ్చిందంటూ కథలు అల్లడం మొదలుపెట్టాయి. వాషింగ్టన్‌ టైమ్స్‌ సైతం ఇదే వాదనకు బలం చేకూరుస్తూ చైనా జీవాయుధ యుద్ధతంత్రంలో భాగంగా ఈ వైరస్‌ను వ్యాప్తి చెందించి ఉండవచ్చని జనవరి చివరలోనే తేల్చేసింది. అయితే మార్చి నెల మధ్యలో ప్రముఖ సైన్స్‌ పత్రిక నేచర్‌ ఒక వ్యాసం ప్రచురిస్తూ.. సార్స్, మెర్స్‌ లాగా మానవులపై తీవ్ర ప్రభావం చూపిన వైరస్‌లలో ఏడవదైన కరోనా వైరస్‌ ఎంతమాత్రమూ లేబొరేటరీలో తయారు చేసింది కాదని, అది ఉద్దేశపూరితంగా సృష్టించి వదిలిన సాంక్రమిక వ్యాధి కానే కాదని ఘంటాపథంగా తేల్చి చెప్పిన తర్వాత మాత్రమే వాషింగ్టన్‌ టైమ్స్‌ తన నిర్ధారణను వెనక్కు తీసుకుంది. 

మరోవైపు శాస్త్రజ్ఞులు మాత్రం కరోనా వైరస్‌ కూడా ప్రకృతి సహజమైనదేనని, అది ల్యాబ్‌ నుంచి పుట్టుకొచ్చింది కాదన్న అభిప్రాయానికే కట్టుబడి ఉన్నారు. ఈ వైరస్‌ మూలం ఏమిటన్నది ఇప్పటికీ వారికి అంతుబట్టనప్పటికీ, ఇంతవరకు లభిస్తున్న ఆధారాల బట్టి ఇది జంతువుల నుంచి మనిషికి సోకిన వైరస్‌ గానే కనిపిస్తోందన్నది సైంటిస్టుల అభిప్రాయం. అయితే వైరస్‌ కంటే శాస్త్రజ్ఞులను కలవరపరుస్తున్న అంశం ఏమిటంటే కరోనా చుట్టూ రాజకీయ వాతావరణం వ్యాపించడమే. దీనివల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ శాస్త్ర పరిశోధనలకు సంబంధించిన సహకారం కష్టమైపోతుందని సైంటిస్టులు భయపడుతున్నారు. 

మరోవైపున ఎన్‌పీఆర్‌ చేసిన విస్తృతమైన విశ్లేషణను బట్టి చూస్తే ఈ నూతన కరోనా వైరస్‌ లేబొరేటరీలో ప్రమాదవశాత్తూ లీక్‌ అయిన దాని ఫలితం అని చెప్పడానికి అవకాశమే లేదని తెలుస్తోంది. జంతువుల నుంచి వైరస్‌ల నమూనాలను సేకరించి పరిశోధనలు చేస్తూ, ప్రయోగశాలల్లో ప్రమాదాలు ఎలా జరుగుతాయనే అంశంపై స్పష్టమైన అవగాహన కలిగిన పదిమంది ప్రముఖ శాస్త్రజ్ఞులను సంప్రదించిన తర్వాత ఎన్‌పీఆర్‌ చాలా స్పష్టంగా నిర్ధారించింది ఏమిటంటే, వైరస్‌లు ప్రమాదవశాత్తూ ప్రయోగశాలల నుంచి లీక్‌ కావాలంటే దానికి సంబంధించిన అనేక కాకతాళీయమైన చర్యలు, అవసవ్య ఫలితాలతోపాటు వాటికి చెందిన ప్రయోగాత్మకమైన ప్రోటోకాల్స్‌ అధ్యయనం అవసరం అవుతుందని ఎన్పీఆర్‌ తేల్చి చెప్పింది.

ఒకటి మాత్రం నిజం. ప్రయోగశాలల్లో ప్రమాదాలు జరుగుతాయి. ల్యాబ్‌లలో ప్రమాదకరమైన వైరస్‌లు, బాక్టీరియా ఎలా పదే పదే లీక్‌ అయి తప్పించుకుంటాయో కెల్సీ పైపర్‌ పలు ఉదాహరణలతో వోక్స్‌ సంచికలో వివరించారు. బర్మింగ్‌హామ్‌ మెడికల్‌ స్కూల్‌లోని ప్రయోగశాలలో స్మాల్‌ పాక్స్‌ ఎలా లీక్‌ అయి ఫొటోగ్రాఫర్‌ను చంపేసిందో కెల్సీ చెప్పారు. అమెరికాలోని పలు ల్యాబ్‌లలో కూడా సీరియస్‌ ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఇతర దేశాల్లో కూడా పేలవమైన శిక్షణ, నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయని దీన్నిబట్టి తెలుస్తోంది. ఎబోలా, సార్స్‌లకు మల్లే వైరస్‌లు ప్రకృతిలో జంతువులకు, మానవులకు మధ్య బదిలీ అవుతుంటాయని ఎన్పీఆర్‌ నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాలు అనేక వైరస్‌లను వ్యాపింపచేస్తున్నాయని అనుమానిస్తున్నారు కానీ ప్రకృతి నుంచి మానవులకు వైరస్‌లు ఎలా సోకుతున్నాయన్నది ఇప్పటికీ మిస్టరీలాగే ఉంటోంది. కానీ, వైరస్‌ల గురించిన అభూత కల్పనలు మీడియోలో సృష్టించడం మాత్రం ఆగిపోలేదు. కరోనా వైరస్‌ ల్యాబ్‌ లోనే పుట్టింది కానీ అది జీవాయుధం కాదని ఫాక్స్‌ న్యూస్‌ తేల్చేసింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాను ముందస్తుగా నేరస్తురాలిగా నిర్ణియించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి పనులకు పాల్పడకుండా చైనాకు అడ్డుకట్ట వేయవచ్చని అమెరికాలోని స్వార్థపరశక్తులు భావించవచ్చు కానీ చైనా సహకారం లేకుండా ఈ వైరస్‌ పరిష్కారానికి సమాధానం లభించదు. కోవిడ్‌–19 వ్యాప్తి నిరోధానికి చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్‌ వంటి ఎన్నో దేశాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవలసిన అవసరం అవశ్యం. కానీ అదే ఇప్పుడు జరగలేదు. ప్రపంచ మానవాళి ముందడుగు వేయాలంటే వైరస్‌లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం అత్యవసరం. అంతేతప్ప చైనాపై ఆరోపించి స్వీయ పరాజయం కోసం ప్రయత్నించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.  (ది వైర్‌ సౌజన్యంతో)  -మనోజ్‌ జోషి, వ్యాసకర్త పరిశోధకులు, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 07:06 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్‌–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి...
08-05-2021
May 08, 2021, 04:16 IST
కోవిడ్‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్‌ చేశారు. అక్కడి...
08-05-2021
May 08, 2021, 04:02 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
08-05-2021
May 08, 2021, 03:45 IST
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు...
08-05-2021
May 08, 2021, 03:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన...
08-05-2021
May 08, 2021, 03:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు...
08-05-2021
May 08, 2021, 03:26 IST
సాక్షి, అమరావతి:  జిల్లా స్థాయిలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన...
08-05-2021
May 08, 2021, 03:20 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల...
08-05-2021
May 08, 2021, 03:15 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్‌ నటుడు...
08-05-2021
May 08, 2021, 03:09 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది....
08-05-2021
May 08, 2021, 03:08 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ ప్రధానంగా గురిపెట్టేది ఊపిరితిత్తుల పైనేనని, దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలొస్తాయని,...
08-05-2021
May 08, 2021, 03:06 IST
కౌలాలంపూర్‌: మలేసియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు...
08-05-2021
May 08, 2021, 02:53 IST
ముంబై: ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే....
08-05-2021
May 08, 2021, 01:22 IST
రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ...
08-05-2021
May 08, 2021, 01:21 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్‌ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన...
08-05-2021
May 08, 2021, 00:43 IST
సాక్షి, కాజీపేట అర్బన్‌: కోవిడ్‌–19పై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో చేపట్టిన పరిశోధనలు ఏడాది...
08-05-2021
May 08, 2021, 00:42 IST
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్‌ ఉంటే...
07-05-2021
May 07, 2021, 21:58 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైద్యానికి మరో కీలక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్‌...
07-05-2021
May 07, 2021, 20:57 IST
రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్‌ వేవ్‌ను  తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన  కేంద్ర ప్రభుత్వ అత్యున్నత...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top