వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

Weekly Horoscope For 18th August To 24th August 2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగప్రాప్తి. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు సహకరిస్తారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై కొంత లాభపడతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వాహనయోగం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి తెస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కొత్తగా రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపిం^è దు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు నెలకొంటాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖుల పరిచయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ప్రత్యర్థుల నుంచి సైతం సానుకూలత వ్యక్తమవుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరుత్సాహం. బంధువులతో  స్థిరాస్తి వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో ప్రతిష్ఠంభన.  సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో వస్తులాభాలు. ఉద్యోగయోగం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తరచూ వివాదాలు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. మీ ఆభిప్రాయాలను కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మీ అంచనాలు నిజం చేసుకుంటారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top