నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా? | Does drinking cold lemonade | Sakshi
Sakshi News home page

నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా?

Jan 31 2016 1:47 AM | Updated on Sep 3 2017 4:38 PM

నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా?

నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా?

నిమ్మకాయ ఉపయోగాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. ఎందుకంటే దాని ప్రయోజనాల జాబితా

నిమ్మకాయ ఉపయోగాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. ఎందుకంటే దాని ప్రయోజనాల జాబితా చాలా పెద్దది మరి! తక్కువ ధరకు దొరికే నిమ్మకాయలో విలువైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి. మొటిమల సమస్య, గొంతు నొప్పి నివారణకు మాత్రమే కాదు శరీరంలోని ప్రతి అవయవానికీ ఉపయోగ పడుతుంది నిమ్మకాయ.

అయితే బహుళ ప్రయోజనాలు ఉన్న నిమ్మపై కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ‘నిమ్మరసం తాగడం  వల్ల జలుబు చేస్తుంది’ అని కొందరు-

‘జలుబు చేసినప్పుడు నిమ్మరసం తాగితే, జలుబు తీవ్రత ఎక్కువవుతుంది’ అని కొందరు-  ‘జ్వరం వచ్చినప్పుడు నిమ్మరసం తాగితే  ఆరోగ్యానికి చెడు చేస్తుంది’ అని మరి కొందరు అపోహపడుతుంటారు.

కానీ ఇవేమీ నిజం కాదు. జలుబు చేసినప్పుడు నిమ్మరసాన్ని నిరభ్యంతరంగా సేవించవచ్చు. ఎందుకంటే నిమ్మరసంలో ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల జలుబు వీలైనంత త్వరగా తగ్గుతుందేగానీ పెరగదు. అలాగే జ్వరంలో ఉన్నప్పుడు తాగితే ఆ వేడిని తగ్గిస్తుంది తప్ప, చెడు చేయదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement