గ్రీన్ టీ.. రుచులు | Green tea flavors .. | Sakshi
Sakshi News home page

గ్రీన్ టీ.. రుచులు

Dec 12 2014 11:52 PM | Updated on Sep 2 2017 6:04 PM

గ్రీన్ టీ.. రుచులు

గ్రీన్ టీ.. రుచులు

టేస్ట్‌లో కాస్త తేడాగా ఉన్నా.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

టేస్ట్‌లో కాస్త తేడాగా ఉన్నా.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గ్రీన్ టీ బెనిఫిట్‌ను మరింత పెంచే ప్రయత్నం చేసింది బేగంపేటలోని వివంతా తాజ్. గ్రీన్ టీతో ప్రత్యేకమైన రెసిపీస్ తయారు చేసింది. టెట్లే గ్రీన్ టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వివంతా తాజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అర్జున్ యాదవ్ గ్రీన్ టీతో తయారు చేసిన స్పెషల్ రెసిపీస్ పరిచయం చేశారు.

వెజిటబుల్ షమ్మీ, స్పైసీ గ్రీన్స్, మలాయ్ సాస్, స్నో పీస్ వంటి వంటకాలను గ్రీన్ టీ వాటర్ మిక్స్ చేసి తయారు చేశారు. గుడ్ హెల్త్  కోరుకునే వారు ఈ రెసిపీస్ టేస్ట్ చేయడం ద్వారా.. రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement