చిత్ర వినాయక.. | ganesh paintings competition | Sakshi
Sakshi News home page

చిత్ర వినాయక..

Sep 8 2014 2:00 AM | Updated on Sep 2 2017 1:01 PM

చిత్ర వినాయక..

చిత్ర వినాయక..

విద్యార్థుల కుంచెల నుంచి జాలువారిన బొజ్జ గణపయ్యు చిత్రాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. రకరకాల రూపాలు, భంగివుల్లో ఆ గణనాథుడ్ని కళ్లముందుంచారు.

విద్యార్థుల కుంచెల నుంచి జాలువారిన బొజ్జగణపయ్యు చిత్రాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. రకరకాల రూపాలు, భంగివుల్లో ఆ గణనాథుడ్ని కళ్లముందుంచారు. బాలయోగి పర్యాటక భవన్‌లో సిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ ఆదివారం ‘గణేశా’ థీమ్‌తో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చిత్రకళలో తవు సృజనను చాటుకున్నారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఒక గ్రూప్‌గా, నాలుగు నుంచి ఆరో తరగతి వరకు రెండో గ్రూప్‌గా, ఏడు నుంచి పదో తరగతి వరకు మూడో గ్రూప్‌గా పోటీలు నిర్వహించారు. మూడు విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement