breaking news
Siri Institute of Painting
-
చిత్ర వినాయక..
విద్యార్థుల కుంచెల నుంచి జాలువారిన బొజ్జగణపయ్యు చిత్రాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. రకరకాల రూపాలు, భంగివుల్లో ఆ గణనాథుడ్ని కళ్లముందుంచారు. బాలయోగి పర్యాటక భవన్లో సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ ఆదివారం ‘గణేశా’ థీమ్‌తో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చిత్రకళలో తవు సృజనను చాటుకున్నారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఒక గ్రూప్‌గా, నాలుగు నుంచి ఆరో తరగతి వరకు రెండో గ్రూప్‌గా, ఏడు నుంచి పదో తరగతి వరకు మూడో గ్రూప్‌గా పోటీలు నిర్వహించారు. మూడు విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. -
బహురూప
చిత్రకారుల చేతుల్లో గణపతి బహురూపాల్లో కనువిందు చేశాడు. వర్ణాలు మిళితం చేసి.. కుంచెను వుుంచి.. కాన్వాస్‌పై అందంగా ఆవిష్కరించారు. వినాయుక చవితి పండుగను వివిధ ఘట్టాలుగా చిత్రాల్లో మలచి మురిపించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బాలభక్త రాజుతో పాటు మరికొందరు కళాకారుల అపు‘రూపాల’తో బుధవారం ఏర్పాటు చేసిన 108 గణేశా పెరుుంటింగ్ ఎగ్జిబిషన్ చూపరులను కన్ను తిప్పుకోనివ్వలేదు. అలాగే.. బేగంపేట్ పర్యాటక భవన్‌లోని రెయిన్బో ఆర్ట్ గ్యాలరీలో సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెరుుంటింగ్ ప్రారంభించిన ‘ది గణేశ’ చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు ప్రదర్శనలూ వచ్చే నెల 4 వరకు సందర్శించవచ్చు. వీటితోపాటు తెలంగాణ టూరిజమ్ పర్యాటక భవన్‌లోనే నిర్వహిస్తున్న ‘మైసూర్ హ్యాండీక్రాఫ్ట్స్’ ఎగ్జిబిషన్‌లోనూ వివిధ గణపతి కళాఖండాలు అబ్బురపరుస్తున్నారుు.