ఆకుకూరలతో ఆ రిస్క్‌కు దూరం

 Eating green leafy vegetables may reduce stroke risk - Sakshi

వాషింగ్టన్‌ : సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహార ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తరచూ ఆకుకూరలు తీసుకునేవారికి స్ర్టోక్‌ రిస్క్‌ 64 శాతం తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక రక్తపోటు కలిగిన వారిలో ఇంట్రాసెరిబ్రల్‌ హెమరేజ్‌ ముప్పు అధికంగా ఉన్న క్రమంలో వీరిలో తాజా ఆకుకూరలు అధికంగా తీసుకునేవారికి స్ర్టోక్‌ ముప్పు 64 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. 682 మంది రోగుల రికార్డులను విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ విషయం పసిగట్టారు.

మెదడులో రక్తస్రావాన్ని (బ్లీడింగ్‌ స్ర్టోక్స్‌) తాజా ఆకుకూరలు తీసుకోవడం ద్వారా అడ్డుకోవచ్చని ఈ పరిశోధన వెల్లడించింది. స్ర్టోక్స్‌లో 32 శాతం బ్లీడింగ్‌ స్ర్టోక్స్‌ కాగా వీటిలో 93 శాతం అధిక రక్తపోటు దీనికి మూల కారణంగా పరిశోధకులు గుర్తించారు.

ఇక డయాబెటిస్‌ రోగులకు స్ర్టోక్‌ ముప్పు 2.3 రెట్లు అధికమని, ఒత్తిడికి గురయ్యేవారికి 2.2 రెట్లు అధికమని తేల్చారు. కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌ అధికంగా ఉండే వారికి స్ర్టోక్‌ ముప్పు 1.6 రెట్లు, పొగాకు సేవించేవారికి 10 రెట్లు స్ట్రోక్‌ ముప్పు అధికమని పరిశోధనలో పేర్కొన్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top