జియోనీ ఈ 7 మినీ | ziyoni mobile new | Sakshi
Sakshi News home page

జియోనీ ఈ 7 మినీ

Apr 17 2014 12:58 AM | Updated on Apr 6 2019 9:01 PM

జియోనీ ఈ 7 మినీ - Sakshi

జియోనీ ఈ 7 మినీ

వీడియో కాలింగ్‌కు ఒక కెమెరా... ఫొటోల కోసం మరో కెమెరా.. స్మార్ట్‌ఫోన్ల అన్నింటి తీరు ఇదే.

కొత్త సరుకు
 వీడియో కాలింగ్‌కు ఒక కెమెరా... ఫొటోల కోసం మరో కెమెరా.. స్మార్ట్‌ఫోన్ల అన్నింటి తీరు ఇదే. జియోనీ ఈ7 మినీ దీనికి పూర్తిగా భిన్నం. ఉన్న ఒకే కెమెరాను ముందుకు, వెనక్కు తిప్పుకునే సౌకర్యం ఉండటం దీని విశేషం. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఎనిమిది కోర్‌లు ఉన్న మీడియాటెక్ 1.7 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌తో మల్టీటాస్కింగ్, వేగం గణనీయంగా ఉంటుంది.

 

దీంతోపాటు 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఒక గిగాబైట్ ర్యామ్‌లతో గేమింగ్ అనుభూతి కూడా మెరుగ్గా ఉండే అవకాశముంది. స్క్రీన్ సైజు దాదాపు 4.7 అంగుళాలు.  డ్యుయెల్ సిమ్ సామర్థ్యంతో వచ్చే ఈలైఫ్ మినీలో 16 గిగాబైట్ల మెమరీ ఉంది. 2200 ఎంఏహెచ్ బ్యాటరీతో దాదాపు 18 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అదనంగా జియోనీ దీంట్లో అమిగో యూజర్ ఇంటర్ఫేస్‌ను చేర్చింది. ధర రూ.18,999.

Advertisement
 
Advertisement
Advertisement