డ్రైవర్‌ లేని ట్రామ్‌ బండి...

Tram train movie without driver - Sakshi

ముందుగా కార్లు వచ్చాయి.. ఆ తరువాత లారీలు.., మోటర్‌బైక్‌లు, డ్రోన్లు క్యూకట్టాయి. డ్రైవర్ల అవసరం లేని వాహనాల తీరిది. తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరుతోంది... ట్రామ్‌! రైలుబడే కానీ.. కొంచెం తేడాగా పనిచేస్తుంది ట్రామ్‌. జర్మనీలోని పోట్స్‌డ్యామ్‌ నగరంలో సిమెన్స్, కాంబినో సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన అటానమస్‌ ట్రామ్‌లు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. ఇతర డ్రైవర్‌ రహిత వాహనాల మాదిరిగానే ఇది కూడా కృత్రిమ మేధ ఆధారంగానే పనిచేస్తుంది. లిడార్, రాడార్‌ సెన్సర్లతోపాటు కెమెరాలను ఉపయోగించుకుని చుట్టూ ఉన్న పాదచారులు, వాహనాలను గమనిస్తూ ముందుకు వెళుతుంది ఈ ట్రామ్‌.

ట్రాక్‌ పక్కన ఉండే సిగ్నళ్లను ఎప్పటికప్పుడు గమనించి అందుకు తగ్గట్టుగా పనిచేస్తాయి కూడా. మొత్తం ఆరు కిలోమీటర్ల ట్రాక్‌పై దీన్ని పరీక్షించి చూశారు. ట్రామ్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒకరు ఉద్దేశపూర్వకంగా ఓ వస్తువును ట్రాక్‌ అవతలకు చేరేలా పట్టుకున్నప్పుడు సెన్సర్లు ఆ విషయాన్ని గుర్తించి వెంటనే ట్రామ్‌ను ఆపివేయడం గమనార్హం. పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తయినప్పటికీ సాఫ్ట్‌వేర్‌ను మరింత ఆధునీకరించిన తరువాత ఈ డ్రైవర్‌ రహిత ట్రామ్‌లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సిమెన్స్‌ కాంబినో సంస్థలు భావిస్తున్నాయి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top