వేడికి చల్లబడుతుంది...చలికి వెచ్చగామారుతుంది

Scientists Develop First Fabric That Automatically Cools or Heats - Sakshi

కాలానికి తగ్గట్టు దుస్తులు వేసుకోవాలని చెబుతూంటారుగానీ.. ఇంకొన్ని రోజులు పోతే ఏ కాలంలోనైనా వాడగలిగే దుస్తులు వచ్చేస్తాయనడంలో సందేహమే లేదు. ఎందుకంటారా? టెక్నాలజీ అంతగా పెరిగిపోతోంది మరి. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ శాస్త్రవేత్తలనే తీసుకుంటే.. వీరు ఓ వినూత్నమైన వస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఎండాకాలంలో చల్లగానూ.. చలికాలంలో వెచ్చగానూ మారిపోయే వస్త్రం ఇది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. వివరాలు చూద్దాం. శరీరం వెచ్చగా ఉంటూ చెమట పడుతూ ఉందనుకోండి. ఈ వస్త్రం దాన్ని గుర్తిస్తుంది.

ఆ వెంటనే పరారుణ కాంతి బయటి నుంచి లోపలికి ప్రసరించేలా చేస్తుంది.. శరీరం మొత్తం పొడిగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే వేడిని అడ్డుకోవడం ద్వారా ఒళ్లు వెచ్చగా ఉండేలా చేస్తుందని వివరించారు యూహాంగ్‌ వాంగ్‌ అనే శాస్త్రవేత్త. నీటిని శోషించుకునే... వదిలించుకునే లక్షణాలున్న రెండు రకాల పోగులతో ఈ వస్త్రం తయారవుతుందని... వీటికి కార్బన్‌ నానోట్యూబుల పూత పూయడం ద్వారా అవి ప్రత్యేక లక్షణాలను కనబరుస్తాయని వివరించారు. ఒక రకమైన పోగు పరారుణ కాంతిని అడ్డుకుంటే.. ఇంకోటి బయటకు పంపేలా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ వస్త్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని... రంగులద్దే సమయంలో కార్బన్‌ నానో ట్యూబులను జత చేయడం ద్వారా సులువుగా తయారు చేయవచ్చునని అన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top