రవితేజ సరసన మరోసారి? | Ravi Teja and Raashi Khanna to act together once again | Sakshi
Sakshi News home page

రవితేజ సరసన మరోసారి?

Sep 29 2016 11:28 PM | Updated on Sep 4 2017 3:31 PM

రవితేజ సరసన మరోసారి?

రవితేజ సరసన మరోసారి?

రాశీఖన్నా ఏ హీరో సరసన నటించినా ఆ హీరోకి యాప్ట్‌గా ఉంటారు. ఒకవైపు సాయిధరమ్ తేజ్‌లాంటి యువహీరోలు...

గాసిప్స్
రాశీఖన్నా ఏ హీరో సరసన నటించినా ఆ హీరోకి యాప్ట్‌గా ఉంటారు. ఒకవైపు  సాయిధరమ్ తేజ్‌లాంటి యువహీరోలు, మరోవైపు రవితేజ లాంటి సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. రవితేజతో ఆమె ‘బెంగాల్ టైగర్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. మరోసారి ఈ జంట సందడి చేయనున్నారని సమాచారం. బాబీ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో రాశీఖన్నాను కథానాయికగా తీసుకున్నారట. ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ఒకవైపు తెలుగు చిత్రాలు చేస్తూనే రాశీఖన్నా తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళంలో సిద్ధార్థ్ సరసన ‘సైతాన్ కా బచ్చా’ అనే తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. తాజాగా, యువహీరో అథర్వ సరసన ఓ తమిళ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం మీద రాశీఖన్నా బిజీ బిజీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement