రెమ్యునరేషన్‌ ఎంతుండొచ్చూ..! | Rashmika Mandanna About Rumours Of Getting Highest Paid Celebrity | Sakshi
Sakshi News home page

రెమ్యునరేషన్‌ ఎంతుండొచ్చూ..!

Jan 17 2020 1:25 AM | Updated on Jan 17 2020 1:25 AM

Rashmika Mandanna About Rumours Of Getting Highest Paid Celebrity - Sakshi

మగవాళ్ల జీతం, ఆడవాళ్ల వయసు అడక్కూడదనే మాట పాతబడి చాలాకాలమే అయింది. ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. మగవాళ్ల కన్నా ఎక్కువగానే కష్టపడి నాలుగు రాళ్లు మోసుకొస్తున్నారు. ఇప్పుడిక ఆడవాళ్ల జీతం, మగవాళ్ల వయసు అడగకూడనివైపోయాయి. అయినాసరే కొందరు అడిగేస్తున్నారు. అమ్మాయి కాస్త శుభ్రంగా ఆఫీసుకెళ్లొస్తుంటే ‘జీతమెంత?’ అని అడిగినట్లే.. హీరోయిన్‌ ఒకట్రెండు సినిమాల్లో వరుసగా కనిపిస్తే ‘రెమ్యునరేషన్‌ ఎంత?’ అని అడిగేస్తున్నారు.

రశ్మిక మందన్నా ఇప్పుడు ఫామ్‌లో ఉంది కాబట్టి ఆమెను కూడా అడగడం మొదలుపెట్టారు. రశ్మిక.. నవ్వుతూ ఆ ప్రశ్నను దాటేస్తున్నారు. ఇక లాభం లేదని రశ్మిక రెమ్యూనరేషన్‌ ఇంతుండొచ్చని, అంతుండొచ్చని ఎవరికివాళ్లే క్యాలిక్యులేటర్‌ పట్టుకుని లెక్కలేస్తున్నారు. లెక్కలు తేలకపోవడంతో... ‘తెలుగులో రశ్మిక ఇప్పుడు హయ్యస్ట్‌ పెయిడ్‌ హీరోయిన్‌’ అని ప్రచారం మొదలుపెట్టారు. దీనికీ రశ్మిక నుంచి నవ్వే సమాధానం. ‘‘నాకైతే.. ఇప్పుడే నేను సినిమా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా ఉంది. రెమ్యూనరేషన్‌ గురించి ఎందుకు ఆలోచిస్తాను’’అని కూడా ఓ మాట అన్నారు. నిజమే కదా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement