కర్ణకేశుడు | On the long side of the ears | Sakshi
Sakshi News home page

కర్ణకేశుడు

Feb 17 2016 10:46 PM | Updated on Sep 3 2017 5:50 PM

కర్ణకేశుడు

కర్ణకేశుడు

తల మీద కేశసంపదను కాపాడుకోవడానికే జనాలు నానా తంటాలు పడుతుంటే, ఈ ఫొటోలోని పెద్దమనిషికి ఏకంగా చెవుల మీద

తిక్క లెక్క
 
తల మీద కేశసంపదను కాపాడుకోవడానికే జనాలు నానా తంటాలు పడుతుంటే, ఈ ఫొటోలోని పెద్దమనిషికి ఏకంగా చెవుల మీద పొడవాటి కేశాలు అయాచితంగానే మొలుచుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని నయాగంజ్‌కు చెందిన ఈ పెద్దాయన పేరు రాధాకాంత్ బాజ్‌పేయి. ఊరకే పెరుగుతున్నాయి కదాని చిరాకు పడకుండా, వాటిని కత్తెరకు బలిపెట్టకుండా అలా వదిలేశాడు.

వయసు పెరిగే కొద్దీ మాడు పలచబడిందే గానీ, చెవుల మీద వెంట్రుకలు మాత్రం తెగ ఏపుగా పెరిగిపోయాయి. ఇవే ఈయనగారికి ఊళ్లో ప్రత్యేక గుర్తింపును తేవడమే కాదు, చెవుల మీద పొడవాటి జట్టుగల మనిషిగా ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించిపెట్టాయి. ఈయనగారి చెవితమ్మల మధ్య నుంచి పెరిగిన జుట్టు పొడవు ఏకంగా 13.2 సెంటీమీటర్లు.

 

Advertisement

పోల్

Advertisement