వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్‌ చేసి.. | Chinese Woman Eating Bat At Restaurant | Sakshi
Sakshi News home page

చెబితే విననంతిష్టం

Jan 25 2020 3:10 AM | Updated on Jan 26 2020 1:17 PM

Chinese Woman Eating Bat At Restaurant - Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్‌కు ‘కరోనా’ అని పేరు పెట్టారు కదా.. ఈ చైనా అమ్మాయికి ‘ధైర్యం’ అని పేరు పెట్టాలి. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌.. పాలిచ్చే పక్షుల వల్ల, ఒక రకం పాముల వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పాక కూడా.. ఈ యువతి రెస్టారెంట్‌లో కూర్చొని.. చక్కగా వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్‌ చేసి, ఆరగిస్తోంది. గబ్బిలం పాలిచ్చే పక్షి అయితే నాకేంటి! నా నాలుకకు రుచినిచ్చే పక్షి అవునా కాదా అన్నదే పాయింట్‌ అన్నట్లు.. చాప్‌స్టిక్స్‌తో కొద్ది కొద్దిగా పీస్‌లు చేసుకుని తన జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరుస్తోంది. (కరోనా వైరస్ తీవ్రతరం)

కరోనా వైరస్‌ సోకి చైనాలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మధ్య చైనాలోని ఉహాన్‌ ప్రాంతంలో ఇటీవలే బయట పడిన కరోనా వైరస్‌... లగేజ్‌ భుజాన వేసుకుని ప్రపంచ దేశాలలో పర్యటించేందుకు బయల్దేరినట్లే కనిపిస్తోంది. యు.ఎస్‌.లో ఒక కేసు బయటపడింది. మన కేర ళలో కూడా ఒక నర్సుకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవేమీ ఈ అమ్మాయికి పట్టినట్లు లేదు. (చైనాలో కరోనా కల్లోలం)

చదవండి:భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement