అక్టోబర్ 4 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Celebrities buying a birthday celebration on October 4 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 4 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 4 2015 12:28 AM | Updated on Sep 3 2017 10:23 AM

అక్టోబర్  4 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 4 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
సంఘవి (నటి), సోహా అలీఖాన్ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వ ఆస్తిపాస్తులు చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరతాయి. కోర్టుకేసుల నుండి విముక్తి లభిస్తుంది. వివాదాలలో చిక్కుకున్న ఆస్తులను గెలుచుకుంటారు. అయితే న్యాయసంబంధమైన, చట్టసంబంధమైన వివాదాలలో ఇరుక్కుంటే వాటినుంచి బయట పడటం అంత సులభం కాదు కాబట్టి రాజీ ధోరణి మంచిది.

మేనేజ్‌మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు, ఫైనాన్స్ రంగ ంలోని వారికి బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ తమ రంగాలలో బాగా పుంజుకుంటారు. మీరు పుట్టిన తేదీ 4. ఇది కూడా రాహు సంఖ్య కావడం వల్ల కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది.  సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. లక్కీ నంబర్లు: 4,5,6,8;

లక్కీ కలర్స్: పర్పుల్, బ్లూ, వయోలెట్, గ్రీన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement