మల్కాజ్‌గిరి నుంచి పోటీచేస్తా: జేపీ | will contest from Malkajgiri constituency, says Jayaprakash narayan | Sakshi
Sakshi News home page

మల్కాజ్‌గిరి నుంచి పోటీచేస్తా: జేపీ

Mar 21 2014 2:00 AM | Updated on Oct 8 2018 8:52 PM

మల్కాజ్‌గిరి నుంచి పోటీచేస్తా: జేపీ - Sakshi

మల్కాజ్‌గిరి నుంచి పోటీచేస్తా: జేపీ

సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ తెలిపారు. స్పష్టమైన జాతీయ దృక్పథం కలిగిన లోక్‌సత్తా పార్టీ గొంతు ఢిల్లీలో వినిపించాలనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారని, అందుకే తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. గురువారమిక్కడ లోక్‌సత్తా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు.
 
 మేనిఫెస్టోలో సాగునీటి అంశాలేమీ లేవు. విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. ‘‘ఇరిగేషన్ సవుస్య ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏమీ కాదుగా’’ అని  కొట్టిపారేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని వస్తున్న డిమాండ్‌ను ప్రస్తావించగా.. ‘‘పోలవరం డిజైన్ గురించి మాట్లాడటానికి నేనేమైనా ఇంజనీరునా’’ అంటూ ఎదురు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement