'వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారు' | Randeep Singh Surjewala takes on kavuri sambhasivarao | Sakshi
Sakshi News home page

'వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారు'

Apr 5 2014 2:47 PM | Updated on Mar 29 2019 9:24 PM

'వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారు' - Sakshi

'వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారు'

కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా విరుచుకుపడ్డారు.

న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో చాలామంది వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యనించారు. కావూరి ...బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రశంసించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

బీజేపీ ఇప్పటివరకూ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయకపోవటానికి కారణం ఏంటో చెప్పాలని సుర్జీవాలా డిమాండ్ చేశారు. ప్రజలను విడదీయటమే బీజేపీ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. కాగా రాష్ట్ర విభజనకు నిరసనగా కావూరి సాంబశివరావు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈమేరకు కావూరి ఆపార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement