ఎంపీలో ముగ్గురు 'ముదురు' ఎంపీలు | Eldest in Lok Sabha from MP aged 73-yrs, youngest 35 | Sakshi
Sakshi News home page

ఎంపీలో ముగ్గురు 'ముదురు' ఎంపీలు

May 19 2014 5:21 PM | Updated on Oct 8 2018 3:19 PM

మధ్యప్రదేశ్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన 29 ఎంపీల్లో ముగ్గురు 70ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.

ఇండోర్: మధ్యప్రదేశ్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన 29 ఎంపీల్లో ముగ్గురు 70ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మరో 12 మంది 50 ఏళ్లు పైబడి వారున్నారు. సాగర్ స్థాన్ నుంచి ఎన్నికైన లక్ష్మీనారాయణ్ యాదవ్(73) అందరికంటే వయసులో పెద్దవారు.

ఖజురహో ఎంపీ నరేంద్ర సింగ్(72), ఇండోర్ నుంచి వరుసగా 8వసారి ఎంపీగా ఎన్నికైన సుమిత్రా మహాజన్(71) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధార్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి గెలిచిన 35 ఏళ్ల సావిత్రి థాకూర్ చిన్న వయసున్న ఎంపీల్లో ముందున్నారు.  మధ్యప్రదేశ్ 29 లోక్సభ స్థానాలుండగా అధికార బీజేపీ 27 స్థానాల్లో విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement