ఎంపీలో ముగ్గురు 'ముదురు' ఎంపీలు
ఇండోర్: మధ్యప్రదేశ్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన 29 ఎంపీల్లో ముగ్గురు 70ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మరో 12 మంది 50 ఏళ్లు పైబడి వారున్నారు. సాగర్ స్థాన్ నుంచి ఎన్నికైన లక్ష్మీనారాయణ్ యాదవ్(73) అందరికంటే వయసులో పెద్దవారు.
ఖజురహో ఎంపీ నరేంద్ర సింగ్(72), ఇండోర్ నుంచి వరుసగా 8వసారి ఎంపీగా ఎన్నికైన సుమిత్రా మహాజన్(71) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధార్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి గెలిచిన 35 ఏళ్ల సావిత్రి థాకూర్ చిన్న వయసున్న ఎంపీల్లో ముందున్నారు. మధ్యప్రదేశ్ 29 లోక్సభ స్థానాలుండగా అధికార బీజేపీ 27 స్థానాల్లో విజయం సాధించింది.