దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి | Democratically taken face it | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి

Apr 22 2014 1:50 AM | Updated on Mar 29 2019 9:24 PM

దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి - Sakshi

దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి

దమ్ముంటే లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు సవాలు విసిరారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు పాలడుగు హితవు

 హైదరాబాద్: దమ్ముంటే లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు సవాలు విసిరారు. ఇటీవల రాజమండ్రిలో కొందరు స్వయంసేవక్‌లు సమావేశమై దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని, మోడీ వస్తేనే దేశం బాగుంటుందని పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. సోమవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. స్వామీజీలు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఇలా చేయిస్తోందని విమర్శించారు. జాతి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. దేశ వినాశనానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement