టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుంది:ప్రకాశ్ జవదేకర్ | bjp, tdp alliance continued, says prakash javadekar | Sakshi
Sakshi News home page

టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుంది:ప్రకాశ్ జవదేకర్

Apr 18 2014 4:11 PM | Updated on Mar 29 2019 9:24 PM

టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుంది:ప్రకాశ్ జవదేకర్ - Sakshi

టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుంది:ప్రకాశ్ జవదేకర్

టీడీపీ-బీజేపీల పొత్తు యాథావిధిగా కొనసాగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్:టీడీపీ-బీజేపీల పొత్తు యాథావిధిగా కొనసాగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జరిపిన చర్చలు సఫలమైయ్యాయని ఆయన తెలిపారు. పొత్తుపై ఇరుపార్టీల నేతలు సానుకూలంగా స్పందించారని, దీనిపై తుది ప్రకటనను కాసేపట్లో వెలువరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇరు పార్టీల నేతలు స్వల్ప మార్పులకు అంగీకరించడంతో బీజేపీ-టీడీపీల పొత్తు ఎప్పటిలాగానే కొనసాగుతుందని జవదేకర్ తెలిపారు. సీమాంధ్రలో  కేటాయించిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు సీట్లను టీడీపీకి వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది.

 

సీమాంధ్రలో బీజేపీతో పొత్తును విరమించుకుంటున్నామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న విజయనగరం జిల్లాలో గజపతినగరం సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఒక్కసారిగా ఉలిక్కిపడిన బీజేపీ శ్రేణులు టీడీపీతో పొత్తుపై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement