టీడీపీ-బీజేపీ పొత్తు వ్యవహారం సందిగ్ధంలో పడింది. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఏకాభిప్రాయం కష్టంగా మారింది.
సందిగ్ధంలో టీడీపీ-బీజేపీ పొత్తు
Mar 28 2014 7:01 PM | Updated on Mar 29 2019 9:18 PM
హైదరాబాద్: టీడీపీ-బీజేపీ పొత్తు వ్యవహారం సందిగ్ధంలో పడింది. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఏకాభిప్రాయం కష్టంగా మారింది.
తెలంగాణలో 45 ఎమ్మెల్యేలు, 8ఎంపీ సీట్లను, సీమాంధ్రలో 22 ఎమ్మెల్యేలు, 5ఎంపీ సీట్లును బీజేపీ కోరుతుండగా అందుకు టీడీపీ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీ సీట్లను, సీమాంధ్రలో 9 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ప్రతిపాదించినట్టు సమాచారం.
చంద్రబాబు నివాసంలో సీట్ల వ్యవహారంపై రెండుగంటలుగా సాగిన చర్చలు కొలిక్కిరాలేదని తెలిసింది. చర్చలు సఫలం కాకపోవడంతో మీడియాతో ఏం మాట్లాడకుండానే బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ వెళ్లిపోయారు.
Advertisement
Advertisement