ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం.. సన్నద్ధమవ్వండిలా.. | prepair to airmen for jobs | Sakshi
Sakshi News home page

ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం.. సన్నద్ధమవ్వండిలా..

Sep 7 2015 12:14 AM | Updated on Sep 3 2017 8:52 AM

ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం.. సన్నద్ధమవ్వండిలా..

ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం.. సన్నద్ధమవ్వండిలా..

భారత వాయు సేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం రాష్ట్రస్థాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో

8 నుంచి 14వరకు ఎంపిక ప్రక్రియ
సంగారెడ్డిలో విస్తృత ఏర్పాట్లు

 
సంగారెడ్డి జోన్: భారత వాయు సేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం రాష్ట్రస్థాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈనెల 8 నుంచి 14 వరకు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ర్యాలీని జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా అభ్యర్థుల నియామకానికి చర్యలు చేపడుతోంది. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు శిక్షణ  కేంద్రంలో ఈ ర్యాలీ జరుగనున్నది. ఎయిర్‌మెన్ ఉద్యోగాల్లో రెండు కేటగిరీల్లో అంటే ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా శిక్షకుడు), సెక్యూరిటీ ఉద్యోగాల నియామకానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణాలోని పది జిల్లాల నుంచి నిరుద్యోగ పురుష అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి డా.రజనిప్రియ, యూత్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు తదితరులతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్న విషయమై వారితో  చర్చించారు.
 
విద్యా శిక్షకుల పోస్టుకు (గ్రూప్ ఎక్స్) ఎంపిక ఇలా..

8వ తేదీ : ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు వుంటాయి.
 9వ తేదీ : రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
 
ర్యాలీకి తీసుకురావాల్సినవి..
గ్రూప్ ఎక్స్ అభ్యర్థులు.. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, బీఈడీ లేదా 2 సంవత్సరాల బోధన అనుభవం, ఉత్తీర్ణత సాధించిన ధ్రువపత్రాలు.
 గ్రూప్ వై అభ్యర్థులు.. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన ధ్రువపత్రాలు. వీటికి సంబంధించి నాలుగు సెట్ల జిరాక్స్ కాపీలు.
 గ్రూప్ ఎక్స్,వై : ఏడు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు. హెచ్‌బీ పెన్సిల్, రబ్బరు, షార్ప్‌నర్, గమ్, టేప్, స్టాప్లర్, బ్లూ/బ్లాక్ బాల్ పెన్నులు.
 
సెక్యూరిటీ విభాగం (గ్రూప్ వై)పోస్టుకు ఎంపిక ఇలా ..
10వ తేదీ : ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. 2.4 కి.మీ.పరుగు పందెం పోటీలు ఉంటాయి.
 11వ తేదీ : ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు, 5కి.మీ.పరుగు, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
 12వ తేదీ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు, 2.4కి.మీ.పరుగు పోటీలు నిర్వహిస్తారు.
 13వ తేదీ : ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు, 5కి.మీ. పరుగు, ఉత్తీర్ణులైన వారికి అదేరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
 14వ తేదీ : ఫలితాలు వెల్లడిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement