
గ్రహం అనుగ్రహం, జులై 22, 2015
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం..
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం
తిథి శు.షష్ఠి ప.2.38 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం హస్త రా.3.48 వరకు
వర్జ్యం ఉ.10.14 నుంచి 11.56 వరకు
దుర్ముహూర్తం ప.11.38 నుంచి 12.28 వరకు
అమృతఘడియలు రా.8.53 నుంచి 10.34 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలత. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మకరం: ఆర్థిక ఇబ్బందులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. సోద రులతో వివాదాలు తీరతాయి. వాహన యోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
- సింహంభట్ల సుబ్బారావు