గ్రహం అనుగ్రహం, ఆగస్టు 16, 2015

గ్రహం అనుగ్రహం, ఆగస్టు 16, 2015 - Sakshi


 శ్రీ మన్మథనామ సంవత్సరం

 దక్షిణాయనం, వర్ష ఋతువు

 శ్రావణ మాసం

 తిథి శు.విదియ రా.10.31 వరకు

 నక్షత్రం పుబ్బ పూర్తి

 వర్జ్యం ప.12.22 నుంచి 2.11 వరకు

 దుర్ముహూర్తం సా.4.41 నుంచి 5.31 వరకు

 అమృతఘడి యలు రా.11.01 నుంచి 12.45 వరకు



 భవిష్యం

 మేషం : ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు వస్తాయి. అనారోగ్యం. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.



 వృషభం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు రావచ్చు.



 మిథునం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. వస్తు లాభాలు. అరుదైన సన్మానాలు. విద్య, ఉద్యోగ అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.



 కర్కాటకం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ధనవ్యయం. మిత్రులతో విభేదాలు రావచ్చు. పనుల్లో జాప్యం జరుగుతుంది. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.



 సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.



 కన్య: వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. బంధుమిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.



 తుల: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. భూ లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.



 వృశ్చికం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆహ్వానాలు రాగలవు. చిన్ననాటి మిత్రుల కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.



 ధనుస్సు: బంధువులతో వివాదాలు రావచ్చు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు చోటుచేసుకుంటాయి.



 మకరం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు.



 కుంభం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.



 మీనం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది.

 - సింహంభట్ల సుబ్బారావు

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top