శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం..
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం, తిథి బ.ద్వాదశి రా.6.05 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం ఆరుద్ర రా.9.46 వరకు, వర్జ్యం ఉ.6.00 నుంచి 7.37 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు, తదుపరి రా.10.54 నుంచి 11.44 వరకు, అమృతఘడియలు ప.11.39 నుంచి 1.14 వరకు
భవిష్యం
మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృషభం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: నూతన విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితుల నుంచి ధనలాభం. ఆహ్వానాలు రాగలవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కర్కాటకం: ఉద్యోగయత్నాలలో అవరోధాలు కలిగే అవకాశం ఉంది. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు పెరగవచ్చు. వ్యాపార,ఉద్యోగాల్లో గందరగోళం.
సింహం: కొత్త మిత్రులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: ఇంటర్వూలు అందుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.
తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. దైవ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు లేనిపోని చికాకులు వస్తాయి. దైవచింతన.
ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన, వస్తు లాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం: బంధువులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆస్తి లాభం. యత్న కార్యసిద్ధి. ఇంటా బయటా ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కుంభం: రాబడికి మించి ఖర్చులుంటాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
మీనం: బంధు విరోధాలు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించ దు. ప్రయాణాలలో మార్పులుండొచ్చు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
- సింహంభట్ల సుబ్బారావు