‘అందుకే లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వడం లేదు’ | ysrcp mla roja comment on chandrababu naidu over lokesh Ministry | Sakshi
Sakshi News home page

‘అందుకే లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వడం లేదు’

Jan 4 2017 2:17 PM | Updated on May 29 2018 3:49 PM

‘అందుకే లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వడం లేదు’ - Sakshi

‘అందుకే లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వడం లేదు’

సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్దాలుగా సాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్యాలెండర్లు మారుతున్నా, చంద్రబాబు మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు.

యూపీ రాజకీయాలు చూసి ఏపీలో చంద్రబాబుకు బీపీ వచ్చిందని, అక్కడ అఖిలేష్‌లాగానే ఇక్కడ లోకేష్‌ కూడా తనను ఎక్కడ అధికారంలో నుంచి దింపేస్తారనే భయం పట్టుకుందని రోజా వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే లోకేష్‌ను మంత్రిని చేయడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారన్నారు.  సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు లేవన్న చంద్రబాబు... పులివెందులకు ఇస్తామంటే జనం నమ్ముతారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అన్యాయం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement