'ఆ ఘటనతో మాకెలాంటి సంబంధం లేదు' | YSRCP Leaders takes on gali muddu krishnama naidu | Sakshi
Sakshi News home page

'ఆ ఘటనతో మాకెలాంటి సంబంధం లేదు'

Feb 10 2016 5:29 PM | Updated on Sep 29 2018 6:14 PM

కాపు గర్జన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలకు... తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.

కాకినాడ : కాపు గర్జన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలకు... తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.  బుధవారం కాకినాడలో వారిద్దరు విలేకర్లతో మాట్లాడుతూ.... టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తుని ఘటనలో తమ ప్రమేయం లేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తామని తెలిపారు. మీరు సిద్ధమా అంటూ గాలి ముద్దుకృష్ణమనాయుడికి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు సవాల్ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement