'కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం' | ysrcp leader pardhasaradhi fires on excise minister | Sakshi
Sakshi News home page

'కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం'

Jan 11 2016 7:05 PM | Updated on May 29 2018 2:42 PM

'కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం' - Sakshi

'కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం'

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గం మచిలీపట్నం కల్తీ మద్యం తయారీకి అడ్డాగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.పార్థసారధి ఆరోపించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం కల్తీ మద్యం తయారీకి అడ్డాగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.పార్థసారధి ఆరోపించారు.

విజయవాడలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిరోజు కల్తీ మద్యం మరణాలు జరుగుతున్నాయన్నారు. ఎక్సైజ్ మంత్రి ఇంటికి సమీపంలోనే కల్తీ మద్యం సామాగ్రి లభించడంతో... రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుని కల్తీ మద్యం మరణాలను అరికట్టాలని పార్థసారధి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement