వాట్సప్‌లో బాలిక నగ్నచిత్రాలు: యువకుడిపై నిర్భయ కేసు | youth arrested for whatsapp blackmail in nizamabad | Sakshi
Sakshi News home page
breaking news

వాట్సప్‌లో బాలిక నగ్నచిత్రాలు: యువకుడిపై నిర్భయ కేసు

Feb 16 2016 3:39 PM | Updated on Oct 17 2018 6:06 PM

వాట్సప్‌లో బాలిక నగ్నచిత్రాలు: యువకుడిపై నిర్భయ కేసు - Sakshi

వాట్సప్‌లో బాలిక నగ్నచిత్రాలు: యువకుడిపై నిర్భయ కేసు

బాలిక నగ్న చిత్రాలను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసిన యువకుడిపై పోలీసులు నిర్భయ చట్టం కేసు నమోదు చేశారు.

చౌట్‌పల్లి (కమ్మర్‌పల్లి) : బాలిక నగ్న చిత్రాలను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసిన యువకుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ పెండ్యాల ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు... కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామానికి చెందిన కుంటాలపల్లి నరేష్ తన సెల్‌ఫోన్‌లో అదే గ్రామానికి చెందిన బాలిక నగ్న చిత్రాలను వాట్సాప్ మెసెంజర్ ద్వారా పలు గ్రూపులకు అప్‌లోడ్ చేశాడు.

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం ఉదయం నిందితుడిని లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి పిలిపించి నిలదీశారు. ఫొటోలు తానే తీశానని, వాట్సాప్‌లో మాత్రం అప్‌లోడ్ చేయలేదన్నాడు. దీంతో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు నరేష్‌ను ఆలయం నుంచి గ్రామపంచాయతీ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, తగిన శాస్తి చేసి పోలీసులకు అప్పగించాలని భావించారు.

ఆలయం బయటకు రాగానే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని, నడిపించుకుంటూ జీపీ వద్దకు తీసుకెళ్తామని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకున్నారు. నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని  ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement